మ్యాడ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

MAD first look released
Monday, May 11, 2020 - 15:45

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది.

మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి, మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా  జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్  అందించిన సంగీతం బాగా  ఆక‌ట్టుకుంటుంది.