మహత్ రాఘవేంద్ర పెళ్లి చేసుకున్నాడు

Mahat Raghavendra gets married
Thursday, February 6, 2020 - 20:30

కోలీవుడ్ లో పలు సినిమాలతో పాపులర్ అయిన మహత్ రాఘవేంద్ర పెళ్లి చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ప్రచి మిశ్రాను పెళ్లాడాడు ఈ హీరో. కాస్త ట్రెడిషనల్ గా, ఇంకాస్త వెస్ట్రన్ కల్చర్ ఉట్టిపడేలా వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి చాలా తక్కువ మంది కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీళ్లలో శింబు, అనిరుధ్ ఉన్నారు.

కెరీర్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ.. మంకథ, జిల్లా సినిమాల్లో చేసిన సైడ్ క్యారెక్టర్స్ తో మహత్ పాపులర్ అయ్యాడు. తర్వాత తెలుగులో కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ లాంటి సినిమాలు చేశాడు. తాప్సితో డేటింగ్ అంటూ  అప్పట్లో వార్తల్లోకి కూడా ఎక్కాడు. ఆ తర్వాత తాప్సి వాటిని ఖండించింది.

అదే సమయంలో ప్రచీ మిశ్రాకు కనెక్ట్ అయ్యాడు మహత్. ఈమె 2012 మిస్ ఎర్త్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది.  అప్పట్నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. మధ్యలో ఓసారి విడిపోయారు కూడా. 2018లో బిగ్ బాస్ సీజన్-2లో పాల్గొన్నాడు మహత్. అదే టైమ్ లో తనతో పాటు హౌజ్ లో ఉన్న యషిక ఆనంద్  అంటే తనకు ఫీలింగ్స్ ఉన్నాయని ప్రకటించాడు.

ఈ ఒక్క స్టేట్ మెంట్ తో ప్రచీకి కోపం వచ్చింది. తను మహత్ విడిపోతున్నట్టు ఆమె సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేసింది. అయితే కొద్ది గంటలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. తర్వాత ఇద్దరూ తమ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను తగ్గించుకున్నారు. మరింతగా ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.