ఆ ఇద్దరి సూపర్ స్టార్ల కాంబినేషన్?

Mahesh and Krishna to act together again?
Friday, January 17, 2020 - 17:00

సౌత్ సినిమా రంగంలో సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణకే దక్కింది. ఆ తర్వాత రజినీకాంత్ కి అది పర్యాయపదంగా మారింది. ఈ తరంలో మహేష్ బాబు కి సూపర్ స్టార్ అనే టాగ్ వచ్చి చేరింది. సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు సూపర్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని చూసి ఏంతో ప్రౌడ్ ఫీల్ గా అవుతుంటారు. అయితే... ఈ తండ్రికొడుకుల కాంబినేషన్ పెద్దగా వర్కౌట్ కాలేదు తెరపై. 

చిన్నప్పుడు కృష్ణ నటించిన అనేక సినిమాల్లో మహేష్ నటించాడు. అవి హిట్ అయ్యాయి. ఐతే, మహేష్ హీరోగా మారిన తర్వాత తన తండ్రితో కలిసి నటించిన సినిమాలు కలిసి రాలేదు. తాజాగా మరోసారి ... వీరి కాంబినేషన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే... లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఒక సన్నివేశంలో కృష్ణ నటించిన ఫేమస్ మూవీ 'అల్లూరి సీతారామారాజు' సినిమాకి సంబందించిన డైలాగుని చూపించారు. ఇలా ఇండైరెక్ట్ గా నటించారు కృష్ణ. మరి నెక్స్ట్ సినిమాలో ... నాన్నగారితో కలిసి నటిస్తారా అని మహేష్ బాబుని అడిగితే..."వై నాట్... అనిల్ రావిపూడిలాంటి దర్శకుడు అలాంటి థాట్ తో వస్తే చేస్తా. అనిల్ మాత్రమే హేండిల్ చెయ్యగలడు" అని సమాధానం ఇచ్చాడు. 

అయితే, కృష్ణ ఇప్పుడు సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. విజయ నిర్మల కన్నుమూత తర్వాత ఆయన మరింత ఢీలా పడ్డారు. మరి ఇద్దరి సూపర్ స్టార్ల కాంబినేషన్ అనేది ఇక తెరపై చూడడం కష్టమే.