మహేష్ ,గౌతమ్.. హైట్ చెక్

Mahesh Babu and his son Gautam check their heights
Saturday, May 23, 2020 - 23:45

ఈ లాక్ డౌన్ టైమ్ ను మహేష్ అంత బాగా మరే హీరో ఎంజాయ్ చేయడం లేదేమో అనిపిస్తుంది. మామూలుగానే షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి మరీ ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తుంటాడు మహేష్. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటాడు. అలాంటిది అనుకోని విధంగా లాక్ డౌన్ రూపంలో ఒకేసారి 2 నెలలు సెలవులు వచ్చేశాయి. దీంతో పూర్తిగా ఫ్యామిలీకే ఫిక్స్ అయిపోయి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.

సితార, గౌతమ్ తో కలిసి మహేష్ పెడుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటేనే సూపర్ స్టార్ ఏ రేంజ్ లో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడో అర్థమౌతుంది. తాజాగా మహేష్ పెట్టిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా కొడుకు బాగా హైట్ అయ్యాడంటూ మహేష్ పెట్టిన ఈ వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

హైట్ చెక్.. హీ ఈజ్ టాల్ అంటూ మహేష్ పెట్టిన ఈ వీడియోకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. గౌతమ్ అంత హైట్ అయిపోయాడా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అటు మహేష్ సిస్టర్ మంజుల అయితే ఈ వీడియోపై రియాక్ట్ అవుతూ.. గౌతమ్ వయసులో మహేష్ అంత హైట్ లేడని చెప్పి మరింత ఏడిపించింది.

ఇలా లాక్ డౌన్ టైమ్ ను ఫుల్ గా కుటుంబానికే అంకితమిచ్చాడు మహేష్. లాక్ డౌన్ ముగిసిన వెంటనే పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.