మహేష్ చేతికి మరో బడా బ్రాండ్

Mahesh Babu bags Jio brand
Tuesday, July 21, 2020 - 18:00

టాలీవుడ్ లో ఎండోర్స్ మెంట్స్ కింగ్ అంటే మహేష్ బాబే. ఈ హీరో చేతిలో ఉన్నన్ని యాడ్స్ మరే తెలుగు హీరోకు ఉండవు. ఇంకా చెప్పాలంటే మహేష్, సినిమాల కంటే యాడ్స్ తో సంపాదిస్తోందే ఎక్కువ. చివరికి హీరోయిన్స్ చేయాల్సిన సౌందర్య ఉత్పత్తుల బ్రాండిగ్స్ కూడా మహేష్ నే వరిస్తున్నాయి. ఇప్పుడీ సూపర్ స్టార్ చేతికి మరో బ్రహ్మాండమైన  వచ్చి చేరింది.

జియో టీవీ ప్లస్ సెట్ టాప్ బాక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు మహేష్. సింగిల్ లాగిన్ తో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి 12 ఓటీటీ వేదికల్ని వీక్షించే సదుపాయం జియో టీవీ ప్లస్ సెట్ టాప్ బాక్స్ తో రాబోతోంది. దీనికి సౌత్ నుంచి మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది జియో. భారీ కాంపిటిషన్ మధ్య మహేష్ ను ఈ బ్రాండ్ వరించింది.

అయితే కేవలం సౌత్ ప్రమోషన్ వరకే మహేష్ కనిపిస్తాడా లేక ఓ బాలీవుడ్ స్టార్ తో కలిసి నార్త్ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్లేక హీరోలంతా అల్లాడిపోతుంటే, మహేష్ ఇలా ఎండార్స్ మెంట్స్ తో దూసుకుపోతున్నాడు.