సెంటిమెంట్ గట్టిగానే ఫాలో అవుతున్నాడు

Mahesh Babu follows this sentiment
Monday, November 11, 2019 - 10:30

తన సినిమాల ఓపెనింగ్ కు మహేష్ రాడనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మహేష్ కు అదొక సెంటిమెంట్. తను ఓపెనింగ్ కు వస్తే రిజల్ట్ తేడా కొడుతుందని భయం. కెరీర్ స్టార్టింగ్ లో 2-3 సందర్భాల్లో అలా జరిగింది. అంతే అప్పట్నుంచి ఇక తన సినిమాల ఓపెనింగ్స్ కు వెళ్లడం మానేశాడు. రీసెంట్ గా తన తరఫున నమ్రతను పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇతర సినిమాలకు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు మహేష్.

ఆదివారం మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా లాంఛ్ అయింది. సొంత మేనల్లుడి సినిమా కాబట్టి మహేష్ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ మహేష్ కు ఆ సెంటిమెంట్ ఉండనే ఉంది కదా, అందుకే మేనల్లుడి సినిమా ఓపెనింగ్ కు కూడా హాజరుకాలేదు. ట్విట్టర్ లో మాత్రం ఆశీర్వదించి ఊరుకున్నాడు. మహేష్ స్థానంలో రామ్ చరణ్, రానా వచ్చి ఓపెనింగ్ వేడుక కానిచ్చారు.

ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ అంతే. అవి అలా బలంగా పాతుకుపోతుంటాయి. తన ప్రతి సినిమా రిలీజ్ కు ముందు దిల్ రాజు తిరుమల వెళ్లడం కూడా ఇలాంటి సెంటిమెంటే. ఇవన్నీ కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటివి ఇండస్ట్రీలో ప్రతి హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి ఉన్నాయి. అయితే మహేష్ కు ఈ ఒక్క విషయంలోనే సెంటిమెంట్. మిగతా విషయాల్లో పెద్దగా సెంటిమెంట్స్ పెట్టుకోడు సూపర్ స్టార్.