"వసుమతి" కోసం మహేష్ ఎదురుచూపు

Mahesh Babu to pair up with Kiara?
Friday, January 24, 2020 - 10:45

వసుమతి గుర్తుందా.. భరత్ అనే నేను సినిమాలో అమాయకంగా కనిపిస్తూ, వసుమతి పాత్రతో అందర్నీ తన చూపులతో కట్టిపడేసింది కియరా అద్వానీ. ఇప్పుడీ అమ్మాయి కోసం మరోసారి వెయిట్ చేస్తున్నాడు మహేష్ బాబు. అవును.. తన అప్ కమింగ్ మూవీలో కియరాను తీసుకోవాలని అనుకుంటున్నాడు మహేష్. నిజానికి ఈ ఐడియా మహేష్ ది కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ప్రతిపాదనను మహేష్ ముందుంచాడు. దానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.వినయవిధేయరామ.. ఈ సినిమా డిజాస్టర్ అయిందని కియరా అద్వానీ టాలీవుడ్ ను వీడి వెళ్లిపోలేదు. అదే

సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు రావడంతో వెళ్లిపోయింది. ఆమె అదృష్టం కొద్దీ కబీర్ సింగ్ హిట్టవ్వడం, ఆ వెంటనే వరుసగా మరో హిట్ పడ్డంతో కియరా బాలీవుడ్ కు ఫిక్స్ అయిపోయింది. మంచి క్రేజీ ఆఫర్ ఉంటే తప్పకుండా మరోసారి టాలీవుడ్ కు రావడానికి కియరా ఎప్పుడూ రెడీ.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కియరా కాల్షీట్లు సంపాదించడం మామూలు విషయం కాదు. కొత్త ఏడాదికి సంబంధించి ఆల్రెడీ కియరా చేతిలో 4 సినిమాలున్నాయి. అన్నీ హిందీ సినిమాలే. వీటి నుంచి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా, ఓ తమిళ సినిమా చేసే ఆలోచనలో ఉంది కియరా. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ లో కియరా కాల్షీట్ ఇస్తుందా అనేది డౌట్. అయితే అక్కడున్నది మహేష్ బాబు. ఏ హీరోయిన్ అయినా కాల్షీట్ ఇవ్వాల్సిందే.