కెరీర్ లో ఇంత రియాక్షన్ చూడలేదు: మహేష్

Mahesh Babu responds about Sarileru Neekevvaru's appreciation
Monday, January 13, 2020 - 19:30

కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. కానీ ఓ సాంగ్ ఇచ్చిన కిక్ ను ఇప్పటివరకు ఏ సినిమా ఇవ్వలేకపోయిందంటున్నాడు మహేష్ బాబు. అదే సరిలేకు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ ను తన కెరీర్ లో ఇప్పటివరకు చూడలేదంటున్నాడు సూపర్ స్టార్.

"దేవిశ్రీ నా సినిమా చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. రీరికార్డింగ్ దేవిశ్రీ చేస్తే నాకు హ్యాపీ. సినిమాలో అల్లూరి సీతారామరాజు ట్రాక్ చేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సంగతి పక్కనపెడితే.. మైండ్ బ్లాక్ లాంటి పాటను నాకోసం అనుకోవడం ఆశ్చర్యం వేసింది. నన్ను ఒప్పించారు. వాళ్ల కోసం ఆ పాట చేశాను. ఇవాళ వస్తున్న రియాక్షన్ చూసి నేను నమ్మలేకపోతున్నాను. ఓ పెద్ద సూపర్ డూపర్ సినిమాకు ఎంత రియాక్షన్ వస్తుందో, అంతకంటే ఎక్కువ రియాక్షన్ వస్తోంది ఈ పాటకి. నాకే అర్థం కాలేదు, నమ్మలేకపోతున్నాను. నాకు ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. ఇంత రియాక్షన్ నా కెరీర్ లో నేను ఎప్పుడూ చూడలేదు."

రెండో రోజు కూడా సరిలేరు నీకెవ్వరు హవా కొనసాగింది. కాస్త థియేటర్లు తగ్గినప్పటికీ ఆక్యుపెన్సీ మాత్రం తగ్గలేదు. పైపెచ్చు టాక్ కూడా పెరగడంతో.. మరో 2 వారాల పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాకు భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. విడుదలైన ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్ల 52 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలా 2 రోజుల్లోనే 55శాతానికి పైగా రికవర్ అయింది మహేష్ మూవీ. సంక్రాంతి సీజన్ ముగిసేనాటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ నుంచి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తోంది ట్రేడ్.