మహేష్ ఫస్ట్ డే ఎవరితో చూశాడో తెలుసా?

Mahesh Babu watched first show of Sarileru Neekevvaru with
Monday, January 13, 2020 - 18:00

హీరోలందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి. మహేష్ బాబుకు కూడా ఉన్నాయి. బహుశా చాలామంది హీరోలు బయటకు చెప్పుకోరు, మహేష్ చెప్పుకోవడం వల్ల ఈ టాక్ వచ్చి ఉంటుంది. తన సినిమాలకు సంబంధించి ఓపెనింగ్స్ కు మహేష్ వెళ్లడు. నేరుగా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తాడు. తను సినిమా ఓపెనింగ్ కు వెళ్తే రిజల్ట్ తేడా కొడుతుందనే సెంటిమెంట్, బాబి సినిమా టైమ్ లోనే మహేష్ కు పట్టుకుంది. ఇప్పుడీ హీరో తనకున్న మరో సెంటిమెంట్ ను కూడా బయటపెట్టాడు.

తనకు సంబంధించిన ఏ సినిమానైనా తొలిసారి చూడాల్సి వచ్చినప్పుడు దాన్ని పిల్లలతో పాటు చూస్తానంటున్నాడు మహేష్. అది తనకు సెంటిమెంట్ అంటున్నాడు. డబ్బింగ్ చెప్పినప్పుడు క్లిప్స్ చూసినా, ఎడిట్ రూమ్ లో రష్ చూసినా.. ఫుల్ వెర్షన్ మాత్రం పిల్లలతోనే చూస్తానంటున్నాడు. గౌతమ్, సితారతో కలిసి సినిమా చూడడం తనకు సెంటిమెంట్ అయిపోయిందంటున్నాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా అలానే తన ఇద్దరు పిల్లలతో కలిసి చూశానని ప్రకటించాడు.

హీరో కృష్ణకు కూడా మహేష్ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది. తన కొడుకు సినిమాల్ని రిలీజ్ కు ముందు కృష్ణ చూడరు. మొదటి రోజు మాత్రమే చూస్తారు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతారు. రిలీజ్ కు ముందే కొడుకు సినిమా చూస్తే రిజల్ట్ తేడా కొడుతుందని, కృష్ణకు కూడా ఓ నమ్మకం. ఈ విషయాన్ని కూడా మహేష్ బాబే బయటపెట్టాడు.