కెమెరామేన్ పై మహేష్ చిరు కోపం

Mahesh Babu's affectionate attitude towards Paparazzi
Monday, February 24, 2020 - 15:30

ఎప్పుడు చూసినా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తాడు. మనసులో కోపం ఉన్నా బయటకు మాత్రం కనిపించనీయడు. ఎవరినైనా ఏదైనా అనాలనుకున్నా స్మూత్ గా చెబుతాడు, సెటైర్లు వేస్తాడు. రియల్ లైఫ్ లో మహేష్ బాబు ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు. ఇన్నాళ్లకు అలా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓ ఫొటోగ్రాఫర్ పై మహేష్ చిరుకోపాన్ని ప్రదర్శించాడు. ఎంతో ముద్దుగా మందలించాడు.

ఎప్పట్లానే ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న మహేష్ ను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. కెమెరాలతో గ్యాప్ ఇవ్వకుండా క్లిక్కుమనిపిస్తూనే ఉన్నారు. అయితే మహేష్ ఎప్పుడు ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టినా ఓ కెమెరామేన్ మాత్రం కచ్చితంగా ఉంటాడు. మహేష్ ఫొటోల్ని అదే పనిగా తీస్తుంటాడు. ఈసారి అతడ్ని మహేష్ గుర్తుపట్టాడు. ఇక చాల్లే ఆపు అన్నట్టు సుతారంగా మందలించాడు.

సదరు కెమెరామేన్ ను చూసిన వెంటనే ఏమ్మా వచ్చేశావా అంటూ సెటైర్ వేసిన మహేష్.. ఎంత సేపు నొక్కుతావ్ బోర్ కొట్టదా నీకు అంటూ చిన్న కోపాన్ని ప్రదర్శించారు. పక్కనే ఉన్న వ్యక్తి తన మొబైల్ లో ఈ సీన్ ను వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఇదంతా ఓ ఎత్తయితే.. సదరు కెమెరామేన్ మాత్రం.. సర్ ఇప్పుడు డ్యూటీ ఎక్కాను సర్ అనడం వీడియోలో కొసమెరుపు.