బాబు అందగాడే కానీ...!

Mahesh Babu's handsomeness is being over exposed?
Monday, January 6, 2020 - 14:30

తెలుగు సినిమా రంగంలో అందగాడు ఎవరు అంటే ముందుగా వేలు చూపేది సూపర్ స్టార్ మహేష్ బాబు వైపే. "మురారి" లోనే మహేష్ బాబు అందం గురించి "అలనాటి బాలచంద్రుడు" అంటూ వర్ణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా దర్శకులు మహేష్ బాబు అందం చుట్టే సీన్లు రాసుకొని బోర్ కొట్టిస్తున్నారు. తాజాగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ లో నిమిషానికి పైనే బాబు...  మోహన రూపం గురించి హీరోయిన్, ఆమె అమ్మ (సంగీత) ఓ ఇదైపోవడం మరీ అతిగా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి. 

మహేష్ బాబు అంటే అందం గురించి సీన్లు ఉండక పొతే హీరోయిజం ఎలేవేట్ అవదా? లాస్ట్ ఇయర్, నాగార్జున కూడా తనకి ఇంకా మన్మధుడు ఇమేజ్ ఉందనుకొని మన్మధుడు 2 చేస్తే... రిజల్ట్ బాడ్ గా వచ్చింది. ఏదైనా అతిగా లాగితే.. మొదటికే మోసం వస్తుంది. 

సో.. నెక్స్ట్ మూవీ నుంచైనా దర్శకులు మహేష్ బాబు అందం (ఇట్స్ ఏ ఫాక్ట్... అతను అందగాడే) గురించి అతి చెయ్యరని ఆశిద్దాం. ఆయనలోని ఇతర హీరోయిక్ ఎలిమెంట్స్ ప్రోజక్ట్  చెయ్యాలి.