మరింత క్లారిటీ ఇచ్చిన మహేష్

Mahesh Babu's Spyder to be completed in June
Wednesday, May 24, 2017 - 17:00

మహేష్ - మురుగదాస్ కాంబోలో వస్తున్న స్పైడర్ మూవీ ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడింది. మొదట జూన్ 23 అన్నారు. తర్వాత ఆగస్ట్ అన్నారు. కానీ ఈ రెండూ వర్కవుట్ కాలేదు. తాజాగా సెప్టెంబర్ కు  సినిమా పోస్ట్ పోన్ అయింది. మరోవైపు సినిమా షూటింగ్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పై ఓ చిన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్.

జూన్ 2వ తేదీకి మహేష్ మూవీ టాకీ షెడ్యూల్ కంప్లీట అయిపోతుందట. అయితే అప్పటికి ఇంకా 2 పాటలు మిగిలే ఉంటాయి. ఆ రెండు పాటల్ని జూన్ ఎండింగ్ నాటికి పూర్తిచేయాలనేది ప్లాన్. మరోవైపు కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. సో.. జూన్ 16 నాటికి స్పైడర్ సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ కాకపోతే.. కొరటాల సినిమాలో నటిస్తూనే సైమల్టేనియస్ గా ఆ రెండు పాటల్ని పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్.

మ‌రోవైపు, ఈ సినిమా టీజ‌ర్‌ని త‌న తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే దీనిపై మ‌రింత క్లారిటీ రావాలి.