రేపట్నుంచే ఫినిషింగ్ టచ్

Mahesh Babu's Spyder final schedule in Hyderabad
Friday, May 12, 2017 - 15:30

మహేష్ మూవీకి సంబంధించి రేపట్నుంచి (May 13) ఫినిషింగ్ టచ్ ప్రారంభం కాబోతోంది. అవును.. స్పైడర్ సినిమా ఫైనల్ షెడ్యూల్ రేపట్నుంచి హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై యూనిట్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతున్నారు. మహేష్ పై తీయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయని కొందరు అంటుంటే.. ఈ నెలాఖరు వరకు షూటింగ్ ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. మహేష్-రకుల్ పై ఓ సాంగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని కూడా అంటున్నారు.

ఏదేమైనప్పటికీ నెలాఖరుకు సినిమాను కంప్లీట్ చేయాలని మహేష్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నిన్నటివరకు గోవాలో ఫ్యామిలీతో పాటు గడిపాడు మహేష్. రేపట్నుంచి స్పైడర్ మూవీ సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయినా అవ్వకపోయినా... కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన “భరత్ అనే నేను" సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు మహేష్.

స్పైడర్ సినిమా జూన్ లో వస్తుందని మొన్నటివరకు అనుకున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ కు సినిమా పోస్ట్ పోన్ అయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆగస్ట్ లో కూడా ఈ సినిమా రాదని తేలిపోయింది. సెప్టెంబర్ లో ఓ డేట్ కోసం చూస్తున్నారట. క్వాలిటీ కోసమే సినిమా ఆలస్యమౌతోందట.