మ‌హేష్ ప్ర‌కృతి, నాని చేప‌, ర‌వితేజ చెట్టు

Mahesh as Nature, Nani as Fish, Ravi Teja as Tree in this weekend releases
Thursday, February 15, 2018 - 15:15

రేపు (ఫిబ్ర‌వ‌రి 16) రెండు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సోద‌రి మంజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం మ‌న‌సుకు న‌చ్చింది, నాని నిర్మించిన తొలి చిత్రం అ బాక్సాఫీస్ బ‌రిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్ ప‌ల్ల‌విస్తుంది.

మ‌హేష్‌బాబు ప్ర‌కృతిగా వినిపిస్తాడు. అవును.. నేచ‌ర్‌కి వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది? అలా అన్న‌మాట‌. ఒక విధంగా చెప్పాలంటే పాత సినిమాల్లో ఆకాశ‌వాణిలా మ‌హేష్‌బాబు గొంత మ‌న‌సుకు న‌చ్చింది సినిమాలో వినిపిస్తుంది. సోద‌రి మంజుల కోసం ఈ వాయిస్ ఓవ‌ర్‌కి ఒప్పుకున్నాడు. మ‌హేష్‌బాబు ఇంత‌కుముందు ప‌లు సినిమాలకి వాయిస్ ఓవ‌ర్‌ని ఇచ్చాడు. కానీ ప్ర‌కృతికి వాయిస్ ఇవ్వ‌డం వెరైటీ ఇపుడు.

ఇక కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తీసిన అ సినిమాలో కాజ‌ల్‌, నిత్య మీన‌న్‌, రెజ‌నీ, ఇషా వంటి స్టార్స్ న‌టిస్తున్నారు. వారితో పాటు నాని, ర‌వితేజ‌ల వాయిస్‌లు కూడా విన‌గ‌లం. వీరిద్ద‌రి గొంతులు సినిమాలో వినిపిస్తాయి. ఈ సినిమాలో చేప పాత్ర‌కి నాని గొంతు ఇచ్చాడు. ఇక ర‌వితేజ ఒక బొన్సాయ్ మొక్క‌కి త‌న గొంతును అరువిచ్చాడు.

అలా ఈ వీకెండ్..ముగ్గురు స్టార్స్ క‌న‌ప‌డ‌రు కానీ విన‌ప‌డుతారు.