పవన్ సినిమాలో మార్పు?

Major changes in Pawan Kalyan's movie
Tuesday, April 14, 2020 - 22:00

ఓవైపు కరోనా ఎఫెక్ట్.. ఫలితంగా లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ షెడ్యూల్ ఆగిపోయింది. దీనికితోడు అంతా ఓకే అనుకున్న శృతిహాసన్ ఆఖరి నిమిషంలో తప్పుకుంది. దీంతో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ పోర్షన్ లేకుండా సినిమాను సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు టాక్..

అవును.. పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ కు పవన్ ను, తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పుచేర్పులు చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందులో భాగంగానే పవన్ సరసన హీరోయిన్ ను సెట్ చేయడంతో పాటు ఆ పాత్రకు కథకు కనెక్ట్ అయ్యేలా మంచి ట్రాక్ కూడా రాసుకున్నాడు.

అయితే వకీల్ సాబ్ హీరోయిన్ వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో ఈసారి నిర్మాత దిల్ రాజు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ ను సిద్ధం చేయాలని యూనిట్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

రీఎంట్రీ తర్వాత పవన్ తన ప్రాజెక్టులో ప్రతి అప్ డేట్ ను పట్టించుకోవడం మానేశాడు. ఎందుకంటే ఓవైపు పొలిటికల్ గా కూడా బిజీగా ఉండడంతో.. కేవలం షూటింగ్, డబ్బింగ్ మాత్రమే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ ను సిద్ధంచేస్తామంటే పవన్ దానికి అడ్డు చెప్పకపోవచ్చు.