పెళ్లా? ఆయనే చెప్పాలి: మలైకా

Malaika Arora Khan responds about her wedding reports
Tuesday, January 14, 2020 - 23:00

భర్తకు విడాకులిచ్చిన మలైకా అరోరా, ఇంకా పెళ్లి కాని అర్జున్ కపూర్ కలిసి తిరుగుతుంటే మీడియా తప్పుగా అర్థం చేసుకుందట. వాళ్లిద్దరూ సహజీవనం చేస్తుంటే దాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందట. టీనేజ్ కొడుకును ఇంట్లో ఉంచేసి, అర్జున్ కపూర్ తో మలైకా ఏకంగా విదేశాలకు చెక్కేస్తుంటే దాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందట. ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా మలైకా అరోరా.

తనకు, అర్జున్ కు మధ్య ఉన్న బంధాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని అంటంది మలైకా. అందుకే ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా తామిద్దరం బహిరంగంగా తిరుగుతున్నామని చెప్పుకొచ్చింది. తమ బంధంలో ఎలాంటి రహస్యం లేదని, ప్రస్తుతం క్లోజ్ గా ఉంటున్నామని, మీడియానే తప్పుడు రాతలు రాస్తోందని అంటోంది మలైకా.

ఇన్ని విషయాలు చెప్పిన ఈ సెక్సీ ఆంటీ.. మరి అర్జున్ ను పెళ్లాడతావా అంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. వైవాహిక జీవితం తనకు కొత్తకాదని, అందుకే ఆ నిర్ణయాన్ని అర్జున్ కే వదిలేశానంటోంది మలైకా.