సైలెంట్ గా పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్

Manali Rathod weds a businessman
Saturday, November 30, 2019 - 17:15

రోయిన్లు అంతే చెప్పాపెట్టకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుంటారు. మొన్నటికిమొన్న ముందురోజు వరకు శ్రియ తన పెళ్లి మేటర్ ను బయటపెట్టలేదు. చాలామంది హీరోయిన్లు ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు. రీసెంట్ గా అర్చన కూడా తన పెళ్లిని గుంభనంగా జరుపుకుంది.

ఇప్పుడీ లిస్ట్ లోకి మనాలీ రాధోడ్ కూడా చేరిపోయింది.

కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సైలెంట్ గా ఉన్న మనాలీ.. పెళ్లి చేసుకుంది. ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తతో హైదరాబాద్ లో ఈమె వివాహం జరిగింది. రాజశేఖర్, జీవిత, హేమ, క్రిష్ లాంటి పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.

వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాతో ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంది మనాలీ రాధోడ్. ఆ మూవీ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. ఒక టైమ్ లో కోలీవుడ్ కు వెళ్లి మరీ లక్ చెక్ చేసుకుంది ఈ సుందరి. అది కూడా వర్కవుట్ కాలేదు. అయితే సినిమాల్లేకపోయినా, సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోల్ని నెట్ లో అప్ లోడ్ చేసేది. వీటిలో కొన్ని బికినీ ఫోటోస్ కూడా ఉన్నాయి. ఇన్నాళ్లూ అలా నెట్టుకొచ్చిన ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.