కోట్లా? కోతలా?

Manchu Manoj claims a fight to be shot with Rs 6 Cr
Thursday, May 21, 2020 - 11:00

ఫస్ట్ టైమ్ కెరీర్ లో ఓ "పాన్-ఇండియా" సినిమా చేస్తున్నాడు మంచు మనోజ్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని హైలెట్స్ బయటపెట్టాడు. సినిమాలో కేవలం ఒకే ఒక్క ఫైట్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. అంతేకాదు.. ఆ ఒక్క ఫైట్ ను 35 రోజుల పాటు తీయబోతున్నారట.

"ఫస్ట్ టైమ్ నా సినిమాకు పీటర్ హెయిన్స్ వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన మిగతా సినిమాల్ని కూడా వదిలేశారు. ఈ ప్రాజెక్టును ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో ఫైట్స్ కోసమే సెపరేట్ గా 60 రోజులు రాసిపెట్టుకున్నాం. అందులో ఒక్క ఫైట్ కోసం ఏకంగా 35 రోజుల షెడ్యూల్ పెట్టుకున్నాం. ఆ ఒక్క ఫైట్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం."

తను కావాలని పాన్ ఇండియా సినిమా చేయడం లేదంటున్నాడు మనోజ్. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథలో పాన్-ఇండియా అప్పీల్ ఉంది కాబట్టి చేస్తున్నానని అంటున్నాడు.

"నేను పాన్ ఇండియన్ సినిమా తీయాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. ఈ కథకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అది పాన్ ఇండియా సినిమా అయింది. ప్రతి కథను పాన్ ఇండియా లెవెల్లో తీయలేం. ఇక ఈ సినిమా టైటిల్ గురించి చాలామంది అడుగుతున్నారు. అది యూనిట్ అంతా కలిసి కూర్చొని పెట్టిన టైటిల్. దాని గురించి మరో రోజు చెబుతా."

ఫైట్ కే 6 కోట్లు పెడితే సినిమాకి అయ్యే బడ్జెట్ ఎంత? మనోజ్ కి ఉన్న మార్కెట్ ఏంటి? నిజంగా ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా? పాన్ ఇండియా సినిమా అనగానే రెగ్యులర్ గా కోసే కోతలా? అనేది కాలమే సమాధానం చెప్తుంది.