థాయ్ అడవుల్లో మొదలెట్టిన మణిరత్నం

Mani Ratnam commences shoot of Ponniyan Selvan
Friday, December 13, 2019 - 17:30

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్... పొన్నియన్ సెల్వన్. దక్షిణాదిని పాలించిన చోళ రాజుల కథ అది. అధికారం, అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు, ప్రేమలు, పగలు... ..ఇలా సాగే భారీ స్టోరీ అది. ఐశ్వర్య రాయి, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, మోహన్ బాబు, విక్రమ్ ప్రభు... ఇలా భారీ తారాగణంతో సాగే పీరియడ్ మూవీ... పొన్నియన్ సెల్వన్. దాదాపు పది, పదిహేనేళ్ల నుంచి తీయాలనుకుంటున్నారు మణిరత్నం. 5 ఏళ్ల క్రితం మహేష్ బాబుతో ప్లాన్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి ...ఇన్నాళ్ళకి షూటింగ్ మొదలైంది. 

తొలిసారిగా తన సినిమా షూటింగ్ ని విదేశాల్లో చేస్తున్నారు మణిరత్నం. దట్టమైన థాయిలాండ్ అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కార్తీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మిగతావాళ్ళు నెక్స్ట్ మంత్ జాయిన్  అవుతారు.

దాదాపు 150 కోట్ల రూపాయలతో తీస్తున్న మూవీ ఇది.