మహేష్ మూవీ గురించి పుకార్లు

Many rumors about Mahesh Babu movie
Thursday, April 9, 2020 - 15:15

మహేష్ బాబు కొత్త సినిమా ఏంటి అంటే .... దర్శకుడు పరశురామ్ తీసే సినిమా అని ఎవరైనా చెప్తారు. ఇందులో డౌట్స్ లేవు. ఐతే, మహేష్ బాబు ఇప్పటికీ రకరకాల కాంబినేషన్లు ఆలోచిస్తున్నాడు అని కొత్తగా పుకార్లు పుట్టుకొచ్చాయి. లక్డౌన్ పీరియడ్ లో అల్లిన వార్తల ప్రకారం... మహేష్ బాబు మరోసారి త్రివిక్రమ్ కి ఫోన్ చేసి సినిమా చెయ్యాలని అడిగాడు అని, త్రివిక్రమ్ పై ప్రెస్సర్ పెడుతున్నాడట. 

నిజానికి త్రివిక్రమ్ ... ఎన్టీఆర్ తో మూవీ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లేట్ అయినా త్రివిక్రమ్ మరో సినిమా చేసే మూడ్ లో లేరు. ఎన్టీఆర్ కోసం ఆగాలనేది అయన ఆలోచన. అలాగే, మహేష్ బాబు కూడా పరశురామ్ సినిమాకి ఫిక్స్ అయ్యాడు. ఇందులో మార్పు లేదు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ గురించి ఎన్నోసార్లు పుకార్లు పుట్టాయి కానీ అవేవి నిజం కాలేదు.

ఫోన్ లో స్టోరీ నేరేషన్ అనేది ఉత్తి పుకారు. మహేష్ బాబు తన కొత్త సినిమా గురించి మే నెలలో అధికారికంగా ప్రకటిస్తారు.