ఈ నెల చప్పగా సాగాల్సిందేనా!

March has small films for release
Monday, March 2, 2020 - 13:30

ఏ ఏడాది తీసుకున్నా మార్చి నెల టాలీవుడ్ డ్రై గా ఉంటుంది. దీనికి కారణం పరీక్షా కాలమ్. స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ తో బిజీగా ఉంటారు. మరికొందరు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉంటారు. సో.. ఆటోమేటిగ్గా ఆ కుటుంబం మొత్తం సీరియస్ గానే ఉంటుంది. అలా బాక్సాఫీస్ వెలవెలబోతుంది. ఈ ఏడాది మార్చి నెల కూడా అలానే తయారైంది.

మార్చిలో చెప్పుకోదగ్గ ఒకే ఒక్క సినిమా V. నాని-సుధీర్ బాబు కలిసి చేసిన ఈ సినిమా మాత్రమే మార్చి నెలలో కాస్త చెప్పుకోదగ్గ ప్రాజెక్టు. ఇది మినహాయిస్తే కనీసం ప్రస్తావించడానికి కూడా మూవీస్ లేవు. అంతెందుకు.. మార్చి మొదటి వారం దాటితే, రెండో వారానికి ఏ సినిమాలు వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అలా ఉంది మార్చి నెలలో మూవీస్ లైనప్.

మార్చి మాసం ఎలాగోలా గడిచిపోయే బాగుంటుందని టాలీవుడ్ మేకర్స్ ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నుంచి కాస్త హాలిడేస్ హడావుడి స్టార్ట్ అవుతుంది. అందుకే తమ సినిమాల్ని ఏప్రిల్ నుంచి సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ కు కాసుల పరంగా కలిసొచ్చేది ఏప్రిల్, మే, జూన్ నెలలు. సో.. ఈ ఒక్క నెల గడిస్తే, ఏప్రిల్ నుంచి మళ్లీ సినిమా పండగే. రెడ్, అరణ్య, నిశ్శబ్దం, లవ్ స్టోరీ.. ఇలా ఓ రేంజ్ లో ఉంది లైనప్.