మారుతి హోమియోపతి లాంటోడు

Maruthi and Homeopathi, what is the conection?
Tuesday, December 10, 2019 - 10:45

తమ దర్శకుల గురించి హీరోలు గొప్పగా చెప్పడం కామన్. సాయితేజ్ కూడా తన డైరక్టర్ మారుతి గురించి అలానే గొప్పగా చెప్పాలనుకున్నాడు. ఏదో పోలిక పెట్టడానికి ట్రై చేశాడు, కానీ అది వేరేలా టర్న్ తీసుకుంది. దీంతో స్వయంగా మారుతి కలుగజేసుకొని సర్దిచెప్పాల్సి వచ్చింది.

మారుతి, కామెడీని డీల్ చేసే విధానం గురించి గొప్పగా చెప్పాలనుకున్నాడు సాయితేజ్. మారుతి సినిమాల్ని హోమియోపతి మెడిసిన్ తో పోల్చాడు. హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ రుచికి మాత్రం తియ్యగా ఉంటుందని.. మారుతి సినిమాలు కూడా అలానే ఉంటాయని చెప్పుకొచ్చాడు.

ఎలాంటి ఎమోషన్ కైనా కామెడీ కోటింగ్ ఇచ్చేసి జనాలతో గుడ్ అనిపించుకోగలడని సాయితేజ్ ఉద్దేశం. కానీ అది సరిగ్గా పండలేదు. దీంతో మారుతి కలుగజేసుకున్నాడు. నమ్మి వాడితే హోమియోపతి కూడా పనిచేస్తుందని, పైగా హోమియోపతి అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి.. తన సినిమాల్లో కామెడీ-ఎమోషన్ కూడా బాగా పండుతాయని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన బస్సుయాత్రలో ఈ ఫన్నీ సీన్ చోటుచేసుకుంది.