మారుతి రేంజ్ ఇప్పుడు రేంజ్ రోవర్

Maruthi gets Renge Rover as a gift
Thursday, January 9, 2020 - 06:30

టాలీవుడ్ కు ఎంతో ఇష్టమైన రేంజ్ రోవర్ గ్రూప్ లోకి ఇప్పుడు మారుతి కూడా చేరిపోయాడు. ప్రతి రోజూ పండగే సినిమా హిట్టవ్వడం మారుతికి ఇలా రేంజ్ రోవర్ కారు కలిసొచ్చింది. సాయితేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. దీంతో యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, మారుతికి రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించాడు. ఇది రెమ్యూనరేషన్ కాదు, దానికి అదనంగా ఇచ్చిన గిఫ్ట్.

ఊహించని విధంగా వచ్చిన కారు చూసి మారుతి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. థ్యాంక్ యు వంశీ డార్లింగ్.. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతి రోజూ పండగే అంటూ తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో బయటపెట్టాడు. ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్ సంస్థకు రెట్టింపు లాభాలు వచ్చినట్టు టాక్.

నిజానికి ప్రతిరోజూ పండగే సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. చాలామంది సినిమా బాగుందంటే కొంతమంది మాత్రం బాగాలేదన్నారు. సరిగ్గా అక్కడే రావురమేష్ మేజిక్ పనిచేసింది. సినిమాను అతడు టర్న్ చేసి పడేశాడు. కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకెండాఫ్ లో అయితే మరింత రెచ్చిపోయాడు. అలా కామెడీతో, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ఈ సినిమా హిట్ అయిపోయింది. దీనికి తోడు బాక్సాఫీస్ వద్ద ఉన్న గ్యాప్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

మొత్తమ్మీద మారుతికి ఓ రేంజ్ రోవర్ దొరికేసింది. ఇదే నిర్మాత గతంలో భలేభలే మగాడివోయ్ హిట్టయినప్పుడు కూడా మారుతికి ఓ కారు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా రేంజ్ రోవర్ కొని చేతిలో పెట్టాడు.