అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో

Mass Ka Das tribute to Mass Hero NTR
Wednesday, May 20, 2020 - 16:45

ఈరోజు ఎన్టీఆర్ తన 37వ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో టాలీవుడ్ అంతా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతోంది. కొందరు తమ దగ్గరున్న స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. మరికొందరు వీడియోలు షేర్ చేస్తున్నారు. కానీ అందరికంటే భిన్నంగా ఆలోచించాడు విశ్వక్ సేన్. తనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఓ సాంగ్ రూపంలో కంపోజ్ చేసి, తారక్ కు బర్త్ డే గిఫ్ట్ గా అందించాడు.

తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు విశ్వక్. ఆ క్లిప్పింగ్స్ తో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాప్ సాంగ్ ను వివేక్ సాగర్ కంపోజ్ చేయగా.. ఆదిత్యరావు గంగసాని స్వయంగా రాసి, ఆలపించాడు. విశ్వక్ సేన్ ను అంతా మాస్ కా దాస్ అంటారు. ఫలక్ నుమా దాస్ తో అతడికి ఈ బిరుదు వచ్చింది. తను మాస్ కా దాస్ అయితే.. ఎన్టీఆర్ మాస్ కా బాప్ అంటూ ఈ వీడియోను అతడికి అంకితం చేశాడు విశ్వక్.

ఈ పుట్టినరోజునాడు ఏదైనా ప్రత్యేకంగా ఉందంటే అది ఈ సాంగ్ మాత్రమే. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్ ఏదీ రిలీజ్ అవ్వలేదు. అటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది ఈ బర్త్ డే ర్యాప్ సాంగ్ ఒక్కటే.