బాలీవుడ్ కు మరో తెలుగు సినిమా

Mathu Vadalara to be remade in HIndi
Wednesday, July 15, 2020 - 10:30

"హిట్", "ఎఫ్2", "జెర్సీ".. ఇలా చాలా సినిమాలు బాలీవుడ్ కు క్యూ కడుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో చిన్న తెలుగు సినిమా చేరింది. అవును.. రీసెంట్ టైమ్స్ లో సైలెంట్ హిట్ అనిపించుకున్న "మత్తు వదలరా" సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు.

కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు "మత్తువదలరా" సినిమాని. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన అతి చిన్న బడ్జెట్ సినిమా ఇదే. ఇప్పుడీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తోంది మైత్రీ. ఈ బ్యానర్ కు ఇదే తొలి హిందీ సినిమా.

కీరవాణి కొడుకు సింహాను పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించింది మైత్రీ మూవీ మేకర్స్. ఇదే సినిమాతో కీరవాణి మరో కొడుకు కాలభైవర, మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయమవ్వగా.. రితేష్ రానా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

హిందీ వెర్షన్ కు హీరోను మార్చబోతున్నారు. దర్శకుడు, సంగీత దర్శకుడు మాత్రం వీళ్లే ఉంటారు.