'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్ లుక్ రిలీజ్

Meeku Maathrame Cheptha first look unveiled
Thursday, August 29, 2019 - 19:15

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరో అయ్యాడు. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోను చేశాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ అనేది టైటిల్. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయింది. 

తరుణ్ భాస్కర్ తో పాటు అనసూయ భరద్వాజ్  కూడా నటిస్తోంది. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ బ్యానర్ పై దేవరకొండ తన నిర్మిస్తున్నాడు ఈ మూవీని. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. "మీకు మాత్రమే చెప్తా"లో తరుణ్ భాస్కర్అ భినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే..పావని
గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

శామీర్ సుల్తాన్ అని కొత్త దర్శకుడు మూవీని డైరెక్ట్ చేసాడు.