మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్

Meena, Keerthy Suresh, Khusbu join Rajinikanth's movie
Tuesday, December 10, 2019 - 18:45

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుందనేది ఓల్డ్ న్యూస్. లేటెస్ట్ గా ... మీనా, ఖుష్బూ కూడా కాస్టింగ్ లో వచ్చి చేరారు. మీనా, ఖుష్భూ గతంలో రజినీకాంత్ సరసన హీరోయిన్లుగా నటించారు. వాళ్ళు ఇప్పుడు తల్లి పాత్రలోకి వచ్చారు. ఐతే ఇప్పుడు వారికి ఏ రోల్స్ దక్కాయి అనేది చూడాలి. 

"రజినీకాంత్ తో చాలా సినిమాలు చేశాను. కానీ దర్శకుడు శివ, సన్ పిక్చర్స్ సంస్థలో నటించడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఈ కథ సూపర్ గా ఉంది. పాత్ర కూడా బాగుంది. షూటింగ్ రోజు కోసం ఎదురుచూస్తున్నాను," అంటూ మీనా తన ఆనందాన్ని తెలిపింది. 

ఈ సినిమాకి శివ దర్శకుడు. అతను ఇంతకుముందు తెలుగులో 'శంఖం' వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు తమిళనాట పెద్ద దర్శకుడిగా స్థిరపడ్డాడు. నేటి తరం ఫామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో రజినీకాంత్ ఈ మూవీ చేస్తున్నాడు. రజినీకాంత్ నటించిన దర్బార్ జనవరి 9న విడుదల అవుతోంది.