బిగ్ బాస్ బ్యూటీ మార్ఫింగ్ ఫొటోలు

Meera Mithun photos uploaded onto porn sites
Thursday, March 26, 2020 - 18:15

బిగ్ బాస్ బ్యూటీ పరువుకు సంబంధించిన మేటర్ ఇది. ఆమె ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, నగ్నంగా తయారుచేసి సెక్స్ సైట్స్ లో పెట్టారు ఎవరో ఆకతాయిలు. అక్కడితో ఆగకుండా ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులో పెట్టేశారు. ఆ బ్యూటీ పేరు మీరా మిధున్. తమిళ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్.

ఊహించని విధంగా తన మార్ఫింగ్ ఫొటోలు, కాంటాక్ట్ డీటెయిల్స్ సెక్స్ సైట్స్ లో కనిపించడంతో మీరా షాక్ అయింది. వెంటనే చెన్నైలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా ఉంది. ఇప్పుడా నంబర్ కు వరుసగా కాల్స్, మెసేజీలు వస్తున్నాయి.

మీరా మిథున్ కు పెద్ద నేపథ్యమే ఉంది. ఈమె మిస్ ఇండియా సౌత్ గా ఎంపికైంది. ఆమె ఫొటో షూట్స్ కు కోలీవుడ్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే క్రేజ్ కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది ఈ అమ్మాయి. 2016లో మిస్ సౌతిండియా కిరీటాన్ని దక్కించుకున్న మీరా.. ఆ ఇమేజ్ ను దుర్వినియోగం చేసిందనే కారణంతో నిర్వహకులు ఆ కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు.

తర్వాత శృతిహాసన్, అక్షరహాసన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ నలుగురి దృష్టిలో పడింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరై హాట్ హాట్ గా కనిపించి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. బిగ్ బాస్ లో హాట్ గా కనిపించడమే ఇప్పుడీమె పాలిట శాపమైంది.