మెగా రెబెల్ కూతుళ్ల నిర్మాణం

Megastar and Rebel Star's daughters step into production.
Saturday, July 11, 2020 - 17:15

ఇటు చిరు కూతురు.. అటు కృష్ణంరాజు కూతురు

టాలీవుడ్ కు ఒకేసారి ఇద్దరు నటవారసురాళ్లు పరిచయం అవుతున్నారు. గమ్మత్తుగా ఇద్దరూ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండడం విశేషం. వీళ్లలో ఒకరు చిరంజీవి కూతురు సుశ్మిత కాగా.. మరొకరు కృష్ణంరాజు కుమార్తె ప్రసీద.

చిరంజీవి కూతురు సుశ్మిత, తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. జీ5లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ఈరోజు లాంఛనంగా మొదలైంది. అలా ఇన్నాళ్లూ డిజైనర్ గా ఉన్న సుశ్మిత కొణెదల అఫీషియల్ గా నిర్మాతగా మారింది.

ఇక కృష్ణంరాజు కుమార్తె, ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాతగా మారారు. అవును.. అన్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమాతో ప్రసీద నిర్మాతగా మారింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రమోద్, వంశీతో పాటు ప్రసీద పేరు కూడా పడింది.

ఇలా ఇండస్ట్రీకి ఒకేసారి అటు చిరంజీవి తనయ, ఇటు ప్రభాస్ కుమార్తె నిర్మాతలుగా పరిచయమవ్వడం యాదృచ్ఛికం.