ఫస్ట్ ప్లేస్ నాదే.. చిరు కౌంటర్

Megastar Chiranjeevi's funny reaction to Charan's video
Saturday, May 2, 2020 - 14:15

సోషల్ మీడియాలోకి ఎంటరైన తర్వాత అడపాదడపా ట్వీట్స్ పెడుతూ, అందరు హీరోల్లానే చిరంజీవి కూడా గుంభనంగా ఉంటారని అంతా అనుకున్నారు. ట్రోలింగ్స్ తట్టుకోవాలంటే ఇలానే ఉండాలని సోషల్ మీడియాలోకి రాకముందు అతడి అభిమానులు కూడా కోరుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఫ్యాన్ గ్రూప్స్ తో సంబంధం లేకుండా అంతా చిరంజీవి ట్వీట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా మరోసారి తనలోని హ్యూమర్ యాంగిల్ ను బయటపెట్టారు చిరంజీవి. నిన్నటికినిన్న చరణ్ ఓ పోస్ట్ పెట్టాడు. వెన్న తయారుచేయడం నేర్చుకుంటున్నానని, అమ్మా-నాన్నమ్మను బటరింగ్ (కాకా పట్టడం) చేస్తున్నానని ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టాడు. దానికి చిరంజీవి అంతే ఫన్నీగా, సెటైరిక్ గా రిప్లయ్ ఇచ్చారు.

"మై డియర్ బచ్చా... మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే"

ఇలా తనదైన స్టయిల్ లో చరణ్ కు కౌంటర్ ఇచ్చారు మెగాస్టార్. ఎంత బటరింగ్ చేసినా (కాకా పట్టినా) తన అమ్మ (అంజనా దేవి) దగ్గర చరణ్ పొజిషన్ బెటర్ అవ్వదంటూ సెటైర్ వేశారు. అదే టైమ్ లో నేను కాకా పడితే చరణ్ అమ్మ దగ్గర (సురేఖ) బటరింగ్ పనిచేయదంటూ తనపై తాను కూడా సెటైర్ వేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ కు లెక్కలేనన్ని లైకులు పడుతున్నాయి.