అజ్ఞాత‌వాసికి చిరు వ‌స్తాడా

Megastar Chiru is invited as main guest for Agnyaathavaasi as main guest?
Wednesday, December 13, 2017 - 15:15

మెగాస్టార్ చిరంజీవిని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమా ఫంక్ష‌న్‌కి మ‌రోసారి గెస్ట్‌గా పిల‌వ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ..చ‌లో రే చ‌ల్ అనే పొలిటిక‌ల్ యాత్ర సంద‌ర్భంగా అన్న‌య్య‌ మెగాస్టార్‌కి  అన్యాయం జ‌రిగింద‌ని వ్యాఖ్యానించ‌డంతో ప‌వ‌ర్‌స్టార్ చిరుతో మ‌ళ్లీ బాగా క‌లిసిపోయార‌నే ఊహాగానం మొదలైంది.

నిజం ఏమిటంటే..రాజకీయ సైద్దాంతిక వైరుధ్యాలు త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా వారి మ‌ధ్య ఏనాడూ సంబంధాలు చెడ‌లేదు.

ఎనీ హౌ, ఇపుడు మ‌ళ్లీ చిరుని అజ్ఞాత‌వాసికి అతిథిగా పిలవాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. మీడియాలోనూ వార్త‌లు వ‌స్తున్నాయి.

త్రివిక్ర‌మ్ టీమ్ మాత్రం దీనిపై స్పందించ‌డం లేదు. ఈ నెల 19న హైద‌రాబాద్‌లో ఆడియో ఈవెంట్ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఆడియో డేట్‌ని పోలీసు అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. రాష్ట్ర‌ప‌తి కోవింద్ ప్ర‌పంచ‌ తెలుగు మ‌హాస‌భ‌ల‌కి వ‌స్తున్న నేప‌థ్యంలో పోలీసు అనుమ‌తి రావ‌డం అంత సులువు కాదు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు డేట్‌ని ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్ మ‌ళ్లీ ఒకే వేదిక‌పై క‌నిపిస్తారా అనేది చూడాలి. ప్ర‌స్తుతానికైతే కేవ‌లం ఊహాగానామే!