మోదీతో మెగాస్టార్! అంతా ఉత్తిదే!!

Megastar in Modi cabinet? Or a rumor?
Thursday, February 13, 2020 - 15:00

మోదీ కేబినెట్లో మెగాస్టార్! అంటూ రెండు రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వైస్సార్సీపీకి ప్రధాని మోదీ మూడు కేంద్ర కేబినెట్ బెర్తులు ఆఫర్ ఇచ్చారని, అందులో ఒక మినిస్టర్ పోస్ట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలని ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారనేది పొలిటికల్ గాసిప్ సారాంశం. జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిసినప్పటినుంచీ ఈ ఊహాగానాలు సాగుతున్నాయి. 

ఐతే, చిరంజీవి మళ్ళీ రాజకీయాల వైపు చూపు వెయ్యడం లేదని, ఆ ఆలోచన లేదనేది చిరు క్యాంపు మాట. అసలు చిరంజీవికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలనేది జగన్ కి ఆలోచన ఉన్నది కూడా డౌటే అని రాజయకీయ విశ్లేషకులు అంటున్నారు. 

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఇది పూర్తి అయ్యాక ఎవరి డైరెక్షన్లో నటించాలనేది ఇంకా తేలలేదు.