ఇక ఆయనే ఇండస్ట్రీ పెద్ద!

Megastar's big daddy role in Tollywood
Monday, March 30, 2020 - 16:15

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి "పెద్ద"గా మారిపోయారు. ఇండస్ట్రీ బాగోగులు ఇప్పుడు అన్ని ఆయనే చూసుకుంటున్నారు. ఏ  సంక్షోభం వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారు. కొన్ని అంశాల్లో వెనకుండి చక్కబెడుతున్నారు. దీనికి కరోనా క్రైసిస్ కి మించిన ఉదాహరణ ఏముంది? గత వారం, పది రోజులుగా మెగాస్టార్ చేస్తున్న సందడి మామూలుగా లేదు.

కరోనా కారణంగా తన సినిమా షూటింగ్ ని రద్దు చేశారు. ఆ తర్వాత మిగతావారు అందరు ఫాలో అయ్యారు. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలంటూ మెసేజ్ వీడియో చేశారు. తర్వాత ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం తనవంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇప్పుడు "కరోనా క్రైసిస్ చారిటీ" పేరుతో ఫండ్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీని ఏకతాటిపైకి తెచ్చారు. 

మొత్తంగా చిరంజీవి తన పెద్దరికాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. సో ఇక ఇండస్ట్రీకి దాసరి లేని లోటును తీర్చడమే చిరు చెయ్యాల్సిన పని.