న‌మిత మెహందీ ఫంక్ష‌న్‌

Mehendi function of actress Namitha
Wednesday, November 22, 2017 - 16:15

36 ఏళ్ల న‌మిత కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడుతోంది. ఎల్లుండే (న‌వంబ‌ర్ 24) ఆమె పెళ్లి వేడుక‌. ప్రియుడు వీర‌తో ఈ నెల 24న తిరుప‌తిలో వెడ్డింగ్‌. మ‌రి పెళ్లి అంటే మెహందీ, సంగీత్‌..ఇలా చాలా తంతు ఉంటుంది క‌దా. మెహందీ ఫంక్ష‌న్ అంటే పెళ్లికూతుళ్ల‌కి, పెళ్లికూతురు చెలియ‌లిక‌త్తెల‌కి సంబ‌ర‌మే క‌దా. ఇదిగో ఈ ఫోటో ఆమె మెహందీ ఫంక్ష‌న్‌దే. న‌మిత ఎంతో సంతోషంగా క‌నిపిస్తూంది క‌దూ.

2002లో ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు న‌మిత‌. 2010లో విడుద‌లైన సింహా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. కానీ రీసెంట్‌గా ‘మన్యంపులి’ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కి క‌నిపించారు.