మెహ్రీన్ ఇష్టపడేవివే

Mehreen likes these brands
Thursday, June 4, 2020 - 13:00

హీరోయిన్లు ఏ బ్రాండ్స్ వాడతారు.. ఏం ఇష్టపడతారు లాంటివి తెలుసుకోవాలని అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ముద్దుగుమ్మ మెహ్రీన్.. తన ఇష్టాల్ని చెప్పుకొచ్చింది. తనకిష్టమైన బ్రాండ్స్ తో పాటు రోడ్ ట్రిప్స్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ గురించి మాట్లాడింది.

- క్యాజువల్ వేర్ బ్రాండ్
గ్లోబల్ దేశీ

- రోడ్ ట్రిప్ డెస్టినేషన్
రాజస్థాన్ లో రోడ్ ట్రిప్స్ కు వెళ్లడం నాకిష్టం. లడక్ ట్రిప్ కోసం వెయిటింగ్

- ఔత్సాహిక నటీనటులకు మీరిచ్చే సూచన
మిమ్మల్ని మీరు నమ్మండి. చేసే పనిని మనసు పెట్టి కష్టపడి చేయండి.

- ఇష్టమైన డిజైనర్లు
అబుజానీ సందీప్ ఖోస్లా, అమిత్ అగర్వాల్

- ఇష్టమైన నగరం
ముంబయి అంటే ఇష్టం. హంపి అంటే కూడా చాలా ఇష్టం

- ఇష్టమైన రిసార్ట్
సూర్యఘర్, ఉదయ్ విల్లాస్

- ఇష్టమైన పుస్తకం
చిత్రా బెనర్జీ - ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్

చూడండి: మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోలు

Mehreen

- సినీ ఫీల్డ్ పై లాక్ డౌన్ ప్రభావం
కరోనా, లాక్ డౌన్ అనేవి మనకు చాలా విషయాలు నేర్పించాయి. ఇది అందరికీ కొత్త. ఇకపై బడ్జెట్స్ తగ్గుతాయి. డబ్బులు ఆలోచించి ఖర్చుచేస్తారు. నేను అనుకోవడం రాబోయే రోజుల్లో పనిలో సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక వినోదం అనేది మనిషి జీవితంలో ఓ భాగం. రాబోయే రోజుల్లో మరింత మంచి కంటెంట్ అందిస్తామనే నమ్మకం ఉంది.