ప్రతిసారి హనీ కావాలంటే ఎలా?

Mehreen talks about comedy roles
Monday, January 27, 2020 - 20:15

మెహ్రీన్.. ఈ హీరోయిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఎఫ్2. ఆ సినిమాలో ఆమె కామెడీ చేసింది. హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చూపించిన ఎక్స్ ప్రెషన్స్ ఆమెను స్టార్ ను చేసి పడేసింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె కామెడీ చేయలేదు. కనీసం కామెడీ సీన్లలో కూడా కనిపించలేదు. ఇదే ప్రశ్న మెహ్రీన్ కు ఎదురైంది. దీనిపై ఆమె రియాక్ట్ అయింది.

"ఎఫ్2లో నేను చేసిన హనీ పాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కామెడీ కూడా చేయగలనని నిరూపించిన సినిమా అది. అయితే ప్రతిసారి హనీ లాంటి పాత్రలు రావు. పైగా హీరోయిన్లకు కామెడీ పండించే అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. సో.. ప్రతిసారి నా నుంచి కామెడీ ఆశించొద్దు ప్లీజ్."

ఇది మెహ్రీన్ రియాక్షన్. ఆమె నటించిన అశ్వథ్థామ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో కామెడీ చేశారా అని మీడియా అమెను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు పై విధంగా రెస్పాండ్ అయింది మెహ్రీన్. నిజానికి అశ్వథ్థామ సినిమాలో అసలు కమెడియన్లు, కామెడీనే లేదంటోంది. లైఫ్ ఎప్పుడూ సరదాగా ఉండదని, కొన్ని సార్లు సీరియస్ గా కూడా ఉంటుందని, అలాంటి సీరియస్ నెస్, ఎమోషన్ ను అశ్వథ్థామలో చూడొచ్చని చెబుతోంది.