కియారా టాప్ లెస్ నిజం కాదా?

Memes on Kiara's top less pose go viral
Thursday, February 20, 2020 - 17:30

ఒక కాలెండర్ కోసం కియారా అద్వానీ టాప్ లెస్ గా ఫోజులు ఇవ్వడం పెద్ద కలకలమే రేపింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. తన ఛాతి భాగాన్నీ ఒక ఆకుని అడ్డం పెట్టుకొని మిగతా అంతా న్యూడ్ గా ఫోజు ఇచ్చింది కియారా. ఐతే, ఇది నిజం కాదు అంటూ కొందరు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఫోటోషాప్ లో ఏమైనా చెయ్యొచ్చు. బట్టలు వేసుకొని ఫోజులు ఇచ్చిన న్యూడ్ గా మార్చేయొచ్చు. 

కియారాని కూడా అలానే చేసి ఉంటారు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు.... టాప్ లెస్ ఫోటోకి బట్టలు వేసి ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు. పైన ఉన్న ఫోటో అలాంటిదే. 

అయితే, ఫోటోగ్రాఫర్ డాబూ రత్నాని మండిపడుతున్నాడు. తానూ ఎప్పుడు ఫోటోషాప్ తో చీట్ చెయ్యను అంటున్నాడు. కియారా సహా తన కాలెండర్ కి ఫోజులు ఇచ్చిన ప్రతి నటి, నటుడు తన ఫోటో షూట్ కి వచ్చి ఫోటో దిగిన వారే అని చెప్పాడు. కియారా ఫోటో రియల్ అని క్లారిటీ ఇచ్చాడు.