తెలుగులో మిమో హీరోగా మూవీ

Mimo debuts in Telugu
Friday, January 24, 2020 - 17:15

బాలీవుడ్‌లో 'డిస్కోడాన్సర్‌'తో అప్పట్లో యువతను ఉర్రూతలూరించిన కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు. భోషో సమర్పణలో శ్రీకళా చిత్ర బేనర్‌పై రమణారావు బసవరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాధవ్‌ కోదాడ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ బాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. జర్నలిజం, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మిమో చక్రవర్తి సరసన 'ఎయిర్‌టెల్‌' మోడల్‌ సశాఛెత్రి నాయికగా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు 90శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రంలోని పబ్‌ సాంగ్‌ను గురువారంనాడు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో చిత్రిస్తున్నారు.