మైండ్ బ్లాక్ అయ్యేలా స్టెప్పులు

Mind Block, Mahesh Babu's mass dance steps
Friday, January 10, 2020 - 08:15

చాలాకాలంగా సరైన డాన్స్ స్టెప్పులు వెయ్యడం లేదనేది మహేష్ బాబు విషయంలో ఫిర్యాదు. దాంతో ఈ సారి మైండ్ బ్లాక్ అయ్యేలా స్టెప్పులు వేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారట. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మనం చూడబోతున్నాం. శేఖర్ మాస్టర్ చాలా కేర్ తీసుకొని స్టెప్పులు డిజైన్ చేశాడట. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో అటు రష్మికతోనూ, ఇటు తమన్నతోనూ సూపర్ గా డాన్స్ లు చేశాడట. మహేష్ బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు.

'సరిలేరు నీకెవ్వరు' సినిమా... ఈ ఫెస్టివల్ మూడ్ కి సూట్ అయ్యేవిధంగా డిజైన్ చేసిన మూవీ. కామెడీ, యాక్షన్, డాన్స్... ఇలా ప్యాకేజింగ్ సరిగ్గా సరిపోయిందని మహేష్ బాబు చెప్తున్నారు. డాన్స్ విషయంలో ఈసారి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఇక. నెక్స్ట్ సినిమా విషయాల్లోనూ ఇలాగే డాన్స్ పరంగా కేర్ తీసుకుంటాను అంటున్నాడు.