'మిస్ మ్యాచ్' డిసెంబర్ 6 న విడుదల

MissMatch locks release date
Friday, November 15, 2019 - 16:15

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం  'మిస్ మ్యాచ్'. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.  ఈ సినిమాని  ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ తెలిపారు. 

"మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్," అన్నారు హీరో ఉదయ్. 

ఈ చిత్రంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ క్రీడా నేపధ్యం కలిగి ఉన్న పాత్రలో, ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి" అన్నారు నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్.