ప్రభాస్ అందరికీ డార్లింగ్.. ఆ ఇద్దరికి తప్ప!

Mohan Babu says Prabhas is King of Cinema World
Thursday, May 4, 2017 - 00:45

డార్లింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. తన సన్నిహితులందర్నీ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలవడం ప్రభాస్ కు అలవాటు. అటు ప్రభాస్ ను కూడా చాలామంది ప్రేమగా డార్లింగ్ అంటూ పిలుచుకుంటారు. అయితే ఇంతమందికి డార్లింగ్ అయిన ప్రభాస్ ఆ ఇద్దరికి మాత్రం డార్లింగ్ కాదు. వాళ్లే మోహన్ బాబు, రానా.

అందర్నీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్.. మోహన్ బాబును మాత్రం బావ అని పిలుస్తాడు. ఎఁదుకో బుజ్జిగాడు సినిమా నుంచి వీళ్లిద్దరి మధ్య ఆ పిలుపు అలా సెట్ అయిపోయింది. మోహన్ బాబును బావ అనడం, తిరిగి మోహన్ బాబు కూడా ప్రభాస్ ను బావ అని సంభోదించడం కామన్ అయిపోయింది. "బాహుబలి 2" సూపర్ హిట్ అయిన సందర్భంగా మరోసారి ఈ “బావ” అనే పిలుపు తెరపైకి వచ్చింది. బాహుబలి-2 సినిమాలో బ్రహ్మాండంగా నటించావంటూ ప్రభాస్ ను మెచ్చుకుంటూనే “ఈ ఏడాది పెళ్లి చేసుకో బావా” అంటూ ముద్దుగా ట్వీట్ చేశారు మోహన్ బాబు.

అటు రానా-ప్రభాస్ కూడా ఒకర్నొకరు బావ అని ముద్దుగా పిలుచుకుంటారు. రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమైన “కొంచెం టచ్ లో ఉంటే చెబుతా” కార్యక్రమంలో ఓ ప్రాంక్ కాల్ చేయమంటే.. ప్రభాస్ కే కాల్ చేశాడు రానా. ఆ కాల్ లో బావ అంటూ ప్రభాస్ ను సంభోదించాడు.