మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఇక హుష్ కాకి!

Mokshagna's shocking photo goes viral
Saturday, November 30, 2019 - 18:00

నందమూరి వంశం నుంచి మూడో జనరేషన్ హీరో కోసం అంతా వెయిటింగ్. మోక్షజ్ఞ మోక్షం ఎప్పుడా అని నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మధ్యమధ్యలో మోక్షజ్ఞ ఇదుగో వస్తున్నాడు... రెడీ అవుతున్నాడు... ట్రైనింగ్ తీసుకుంటున్నాడు... బరువు తగ్గుతున్నాడు... వంటి వార్తలు అభిమానులని ఊరించాయి. తాజాగా సర్కులేట్ అవుతున్న ఫొటో మాత్రం అందర్నీ షాక్ కు గురిచేసింది. నందమూరి ఫ్యాన్స్ అయితే బిత్తరపోయేలా చేసింది.

షేప్ అవుట్ ఫిజిక్ తో దర్శనమిచ్చాడు మోక్షజ్ఞ. ఆ లుక్ చూసిన తర్వాత ఎవరైనా, మోక్షజ్ఞ ఇప్పట్లో తెరపైకి రాడనే విషయాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు అలా ఉంది ఆ పిక్. అసలు అతనికి ఆ ఆలోచనే లేదని అర్థం అవుతోంది. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ అవడం అనేది డౌటే. 

రీసెంట్ గా రూలర్ సినిమా టైమ్ లో బాలయ్య ఫ్యామిలీ మొత్తం ఫొటో దిగింది. ఇందులో బాలయ్య చిన్నకూతురు, చిన్నల్లుడు కూడా ఉన్నారు. ఈ పిక్ లో కాస్త భారీకాయంతో, పెద్ద పొట్టతో దర్శనమిచ్చాడు మోక్షజ్ఞ. నిన్నట్నుంచి ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.