బిగ్ బాస్ హౌజ్ పై ఫుల్ క్లారిటీ

More Clarity on Bigg Boss Telugu 4
Tuesday, August 4, 2020 - 18:00

స్టార్ మా ఛానెల్ లో త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్-4 పై క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది బిగ్ బాస్ సీజన్-4.  ఫైనల్ గా సెలక్ట్ అయిన 15,14 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్-4 కొనసాగుతుంది.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా సెలక్ట్ అయిన కంటెస్టెంట్స్ అంతా సీజన్ ప్రారంభానికి ముందే హోం ఐసొలేషన్ లోకి వెళ్తారు. ఆ తర్వాత అట్నుంచి అటు బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశిస్తారు.  సీజన్-4కు సంబంధించి ప్రోమో షూట్ ఇప్పటికే పూర్తయింది. 

సూపర్ హిట్టయిన ఈ సీజన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది స్టార్ మా ఛానెల్. ఈ కరోనా/లాక్ డౌన్ టైమ్ లో రెవెన్యూ పరంగా నష్టాల నుంచి గట్టెక్కాలంటే.. బిగ్ బాస్ ఒక్కటే ఆ ఛానెల్ కు ప్రధానాస్త్రం. ఇప్పటికే ప్రోమో షూట్ పూర్తిచేసిన నాగార్జున.. ఈనెలాఖరు నుంచి ప్రతి వారాంతం బిగ్ బాస్ సీజన్-4 షూటింగ్ లో పాల్గొంటాడు.

సీజన్-4లో భాగంగా హౌజ్ లోకి ఎవరు ఎంటరవుతారనే సస్పెన్స్ కొనసాగుతోంది.