ఈ ఏడాది నంబర్ వన్ మూవీ ఇదే

Most viewed movie of Indian cinema in 2019
Monday, December 9, 2019 - 08:15

దేశవ్యాప్తంగా ఈ ఏడాది హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. గడిచిన రెండేళ్లుగా సౌత్ సినిమాలు కూడా జాతీయస్థాయిలో క్లిక్ అవుతున్న విషయం తెలిసిందే. అలా ఈ ఏడాది కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా మరో ఘనత సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా కేజీఎఫ్ నిలిచింది.

ఈ ఏడాది అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్ని డిజిటల్ స్ట్రీమింగ్ కు పెట్టింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్. ఇందులో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా కేజీఎఫ్ నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ అవ్వడం అమెజాన్ కు ప్లస్ అయింది. 5 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను దాదాపు ప్రతి లాంగ్వేజ్ కు చెందిన ప్రేక్షకుడు టచ్ చేశాడు.

పైగా ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదలవ్వడం, ఆ వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి రావడంతో అత్యధిక వ్యూస్ సాధ్యమైంది. ప్రస్తుతానికి కేజీఎఫ్ వివరాల్ని మాత్రమే వెల్లడించిన అమెజాన్, మరో వారం రోజుల్లో తమ ఫ్లాట్ ఫామ్ పై అత్యథిక వ్యూస్ సాధించిన టాప్-10 సినిమాల్ని విడుదల చేయబోతోంది.