మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ క‌థ కాపీ కొట్టింది కాదు!

Mr Perfect plagiarism row: Dasarath clarifies
Monday, September 18, 2017 - 16:00

సినిమా విడుద‌లైన ఆరేళ్ల త‌ర్వాత క‌థ విష‌యంలో వివాదం చెలరేగి దిల్‌రాజుపై కేసు న‌మోదు అవ‌డం ఒక విచిత్రం. ప్ర‌భాస్ హీరోగా ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ..2011లో విడుద‌ల‌యింది. 2017 సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా క‌థ గురించి కేసు ఫైల్ అయింది. 

"నా మనసు కోరింది నిన్నే" అనే త‌న నవలను కాపీ కొట్టార‌ని ఆరోపిస్తూ శ్యామలా రాణి అనే రచయిత్రి నిర్మాత దిల్ రాజుపై కేసు వేశారు. ఈ ఆరోప‌ణ‌లపై ద‌ర్శ‌కుడు దశ‌ర‌థ్ స్పందించారు. ఆ న‌వ‌ల రాక‌ముందే త‌న క‌థ‌ని రైటర్స్ యూనియ‌న్‌లో న‌వ్వుతూ అనే పేరుతో ద‌శ‌ర‌థ్ రిజిస్టర్ చేశాడ‌ట‌. ప్ర‌భాస్ బిల్లా సినిమా షూటింగ్ టైమ్‌లోనే ఆయ‌న‌కి స్టోరీ వినిపించాడ‌ట‌. ఇదంతా 2009లో జ‌రిగింది. 

అంటే శ్యామలా రాణి నవల మార్కెట్లోకి రాకముందే తమ కథను రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయించామని క్లారిటీ ఇచ్చాడు దశ‌ర‌థ్‌. స‌ద‌రు ర‌చ‌యిత్రిపై రివ‌ర్స్‌లో కేసు ఫైల్ చేస్తానంటున్నాడు.