యంగ్ శివ‌గామిగా హాట్ భామ

Mrunal Thakur to play Sivagami in web series
Wednesday, September 19, 2018 - 23:00

'బాహుబ‌లి' సినిమా వెబ్‌సిరీస్‌గా రూపొందుతోంద‌నేది ఓల్డ్ న్యూస్‌. శివ‌గామి పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌నే వెబ్‌సిరీస్‌గా రూపొందుతోంది. బాహుబ‌లి, భ‌ల్లాల‌దేవా త‌ల్లిగా శివ‌గామిని చూశాం. కానీ శివ‌గామి రారాణిగా మార‌క‌ముందు ఆమె క‌థ ఏంటి? ఆమె మ‌హిష్మ‌తి రాజ్యంలో అడుగుపెట్ట‌క‌ముందు ఎక్క‌డ పుట్టింది, ఎక్క‌డ పెరిగింద‌నేదే ఈ వెబ్‌సిరీస్‌లో చూపిస్తారు. 

రారాణి శివ‌గామి పాత్ర‌ని ర‌మ్య‌కృష్ణ పోషించారు. మ‌రి యంగ్ శివ‌గామికి ఎవ‌రు సెట్ అవుతారు అన్న ప్ర‌శ్నకి స‌మాధానం దొరికింది. మృణాల్ ఠాకూర్ అనే హిందీ సీరియ‌ల్స్‌లో న‌టించే భామ‌ని ఈ పాత్ర‌కి సెల‌క్ట్ చేశారు. ఈ అమ్మ‌డు చాలా హాట్‌. శివ‌గామి యువ‌తిగా ఉన్నప్పుడు చాలా అందాల రాశి అనేది ఒక ఊహ. అందుకు త‌గ్గ హాట్‌నెస్ ఈ భామ‌లో ఉంద‌నిపిస్తోంది. గూగుల్‌లో ఆమె పేరు సెర్చ్ చేస్తే అన్నీ గ్లామ‌రస్ పిక్‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ వెబ్‌సిరీస్‌ని నెట్‌ప్లిక్స్ సంస్థ నిర్మిస్తోంది. నెట్‌ప్లిక్స్‌లోనే ప్ర‌సారం కానుంది. రాజ‌మౌళి ఈ వెబ్‌సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు. ఐతే క్రియేటివ్ టీమ్ అంతా ముంబైకి చెందినవారే. అస‌లు ప‌ని అంతా నెట్‌ప్లిక్స్ సంస్థ క్రియేట్ చేసుకున్న టీమే చేయ‌నుంది. ఐతే మొత్తం సిరీస్‌కి డైర‌క్ట‌ర్స్‌గా ప్ర‌వీణ్ స‌త్తారు, దేవ‌క‌ట్టా వ్య‌వ‌హారిస్తారు. 

"చంద‌మామ క‌థ‌లు", "గ‌రుడ‌వేగ" చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మొద‌టి భాగాల‌ను డైర‌క్ట్ చేస్తున్నాడు.