ఎమ్మెస్ రాజుపై కామెంట్స్

MS Raju gets trolling over Dirty Hari
Sunday, January 5, 2020 - 09:45

ఎమ్మెస్ రాజు
ఈ పేరు చెప్పగానే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, దేవి, శత్రువు.. ఇలా వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. ఇలాంటి వ్యక్తి ఓ అడల్ట్ కంటెంట్ మూవీ తీస్తాడని ఊహించగలమా. కానీ ఇదే నిజం. ఓ అడల్ట్ కంటెంట్ మూవీని ప్రకటించాడు ఎమ్మెస్ రాజు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోందని, అందుకే తను కూడా ఈ జానర్ లో ఓ సినిమా తీస్తున్నానని చెబుతున్నాడు. ఈ సినిమాకు అతడు పెట్టిన పేరు డర్టీ హరి.

హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే కుర్రాడ్ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు ఎమ్మెస్ రాజు. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు నిర్మాత ఎమ్మెస్ రాజు కాదు. ఆయన ఈ సినిమాకు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. మూవీ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా రాజుగారు వదిలిన పోస్టర్ చూస్తే మతిపోతుంది.

ఓ బాత్ టబ్ లో హీరో పడుకొని ఉంటాడు. అతడి నోట్లోకి హీరోయిన్ తన కాలి వేళ్ల మధ్య నుంచి సిగరెట్ అందిస్తుంది. దాన్ని సదరు హీరో వెలిగిస్తాడు. . ఈ ఒక్క స్టిల్ తో చాన్నాళ్ల తర్వాత హాట్ టాపిక్ అయిపోయాడు ఎమ్మెస్ రాజు. అన్నట్టు ఈ సినిమాలో చిలసౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్. అయితే,  ఎమ్మెస్ రాజు ఇలా మారడం గురించి సోషల్ మీడియా చాల కామెంట్స్ పడుతున్నాయి. 

ఇలాంటి సినిమాలు చేసే బదలు సైలెంట్ గా ఉండాల్సింది అని సినిమా రిలీజ్ కి ముందే విమర్శలు మొదలు అయ్యాయి.