మహేష్ బాబు స్వచ్ఛమైన వ్యక్తి: మురుగ

Murugadoss praises Mahesh Babu
Sunday, January 5, 2020 - 11:45

దర్శకుడు మురుగదాస్ తీసిన "గ‌జిని", "తుపాకీ", "క‌త్తి", "సర్కార్" వంటి సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి. కానీ ఆయన తెలుగులో తీసిన "స్టాలిన్" సో సో అనిపించుకొంది. ఇక మహేష్ బాబు హీరోగా డైరెక్ట్ చేసిన "స్పైడర్" దారుణంగా పరాజయం పాలైంది. అంటే తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో విఫలం అవుతున్నారన్నమాట. అనువాద చిత్రాల ద్వారే మన మనసు గెలుచుకోగలుగుతున్నారు. అయితే, తెలుగులో మహేష్ బాబు లాంటి మంచి స్టార్ కి డిజాస్టర్ ఇచ్చాను అనే బాధ వెంటాడుతూనే ఉంది అంటున్నారు మురుగదాస్. 

"త‌మిళంలో హీరోల ఇమేజ్‌ను బేస్ చేసుకుని సినిమాల‌ను చేస్తున్నాను. కానీ తెలుగులో ఎందుక‌నో అది మిస్ అవుతుంది. మ‌హేష్ లాంటి హీరోకు ప్లాప్ ఇచ్చాననే బాధ న‌న్ను వెంటాడుతూనే ఉంది. ఆయన చాలా స్వ‌చ్ఛ‌మైన వ్య‌క్తి. అంత అపజయం తర్వాత కూడా ఆయన నాతో టచ్ లోనే ఉన్నారు. అదే స్నేహం ఉంది. ద‌ర్బార్ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను ఆయ‌నే విడుద‌ల చేశారు," అంటూ చెప్పుకొచ్చారు.

అయితే, మురుగదాస్ తెలుగు సినిమాలపై పూర్తిగా ఆశలు వదులుకోలేదు. త్వరలో అల్లు అర్జున్ తో కూడా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు.