ట్రెండ్ మార్చిన మైత్రీ మూవీ మేకర్స్

Mythri Movie Makers to produce a small movie with Chaitu?
Tuesday, May 2, 2017 - 15:30

వచ్చీ రావడంతోనే భారీ సినిమాల బ్యానర్ గా పేరుతెచ్చుకుంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి భారీ బడ్జెట్ మూవీ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి మరో బిగ్ బడ్జెట్ మూవీ చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో బడా మూవీ చేస్తోంది. ఇలా వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక్కసారిగా ట్రాక్ మార్చింది. మీడియం రేంజ్ బడ్జెట్ మూవీని లైన్లో పెట్టింది.

నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. ప్రేమమ్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సెకెండ్ మూవీ, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. మీడియం రేంజ్ లో ఓ 15 కోట్లకు అటుఇటుగా సినిమా తీయాలనుకుంటున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.