ముంబయిలో మ్యూజిక్ సిట్టింగ్స్

Na Peru Surya Music Sittings
Tuesday, July 18, 2017 - 12:15

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. స్వయంగా బన్నీ ఇందులో పాల్గొంటున్నాడు. కేవలం ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనేందుకే ముంబయి వెళ్లాడు అల్లు అర్జున్.  నా పేరు సూర్య సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్-శేఖర్ కు ముంబయిలో స్టుడియోలో ఉంది. ఆ స్టుడియోలో సినిమాకు సంబంధించి సంగీత చర్చలు జరుగుతున్నాయి.

వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది 'నా పేరు సూర్య' సినిమా. హిమాచల్ ప్రదేశ్, జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. బన్నీ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ చేశారు. శరత్ కుమార్ విలన్ గా నటించనున్న ఈ సినిమాలో బన్నీకి తండ్రిగా సీనియర్ నటుడు అర్జున్ కనిపించబోతున్నాడు.